గన్నేరువరం: ట్రాన్స్ఫార్మర్ లేక చాకలివాని పల్లె రైతుల కష్టాలు... వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన...
ట్రాన్స్ఫార్మర్ కోసం రైతుల నిరసన... ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం గద్దె నిర్మించి ఆరు నెలలు గడచినప్పటికీ కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం లేదని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకలివాని పల్లె రైతులు బుధవారం మద్య్హనం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసలే వర్షాలు లేక నానా పాట్లు పడి నాట్లు పూర్తి చేసుకుంటే అస్తవ్యస్తమైన కరెంటుతో మోటర్లు నడవక నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఏఈ ఆంజనేయులు అడిగితే రూ. 25000 ఇస్తేనే కొత్త ట్రాన్స్ఫార్మర్ పెడతామని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపించారు.