మేడ్చల్: బాలానగర్ లో కారును ఢీ కొట్టిన కంటైనర్
బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం జాతీయ రహదారి 44 పై జడ్చర్ల నుంచి హైదరాబాద్ వెళుతున్న కంటైనర్ ముందున్న కారును వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నజ్జయింది. అయితే కారులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. భారీ వర్షం కారణంగా హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ లెనిన్ ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.