ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నగర పంచాయతీ కమిషనర్ రామకృష్ణ ప్రారంభించారు. ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగి ఉన్న చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులు తమ విధిగా భావించి తమ పిల్లలకు పోలియో రాకుండా చూసుకోవాలని రామకృష్ణ అన్నారు. పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నేడు జరుగుతుందని కమిషనర్ అన్నారు.