పామర్రు లో కూటమి రైతులను పట్టించుకోవటం లేదు: కైలే అనిల్
Machilipatnam South, Krishna | Sep 15, 2025
పామర్రులోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. కూటమి పాలనలో గత 15 నెలలుగా జరుగుతున్న అవినీతిపై మాట్లాడటం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, యూరియా దొరకని పరిస్థితి ఏర్పడిందని, కూటమి నేతలు రైతుల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.