మంథని: మంథని మార్కెట్లో కూరగాయల బంద్
మంథని మార్కెట్లో కూరగాయల అమ్మకాలు బంద్ చేశారు మార్కెట్ వ్యాపారస్తులు. గురువారం కూరగాయల మార్కెట్ అధ్యక్షులు సిద్ధం రవీందర్ ఆధ్వర్యంలో మార్కెట్లో కూరగాయలు అమ్ముకునేవారు కూరగాయల మార్కెట్‌ను బంద్ చేశారు అనంతరం ధన్వాడలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిసి మార్కెట్లో కూరగాయల అమ్మకాలపై ఇబ్బందులను తెలియజేశారు. కూరగాయలు అమ్ముకునే వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా తగు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు . ఈ కార్యక్రమంలో కూరగాయలు అమ్ముకునే వారు పాల్గొన్నారు.