సూళ్లూరుపేట - నెల్లూరుకు లోకల్ ట్రైన్స్ రద్దు
- వెల్లడించిన నాయుడుపేట రైల్వే స్టేషన్ ఎస్ఎస్ చిరంజీవి
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నుండి నెల్లూరు వెళ్లే లోకల్ ట్రైన్స్ మంగళవారం రద్దు చేసినట్లు నాయుడుపేట రైల్వే స్టేషన్ ఎస్ ఎస్ చిరంజీవి తెలిపారు. సూళ్లూరుపేట నుంచి నెల్లూరు వెళ్లే రైలు నెంబర్ 66035, అలాగే నెల్లూరు నుండి సూళ్లూరుపేట వచ్చే లోకల్ ట్రైన్ నెంబర్ 66036 లను మంగళవారం పూర్తిగా రద్దు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ మార్గంలో ఈ రెండు లోకల్ ట్రైన్స్ సాంకేతిక కారణాల వల్ల రద్దు చేయబడ్డాయి అన్నారు. రైల్వే ప్రయాణం చేసే ప్రయాణికులు రైలు సమాచారం కనుక్కొని ప్రయాణించాలని ఆయన సూచించారు.