జలదిగ్బంధంలో ముళ్ళపూడి గ్రామం
జల దిగ్భంధంలో ముళ్లపూడి గ్రామం శ్రీకాళహస్తి(M) ముళ్లపూడి గ్రామంలో వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గ్రామం జల దిగ్బంధం అయిన విషయం తెలిసిందే. ప్రజల అవస్థలను తెలుసుకున్న CPI జిల్లా కార్యదర్శి మురళీ గురువారం గ్రామాన్ని సందర్శించారు. ప్రజలు గ్రామం నుంచి బయట రాలేక ఇక్కట్లు పడుతున్నా అధికారులు స్పందించడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిత్యవసర సరకులు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన కోరారు.