రాయదుర్గం: పట్టణంలోని జూ.కళాశాల మైదానంంలో టపాసుల స్టాల్స్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
దీపావళి సందర్భంగా ఎటువంటి అగ్ని ప్రమాదాలకు తావులేకుండా రాయదుర్గం పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన టపాసుల స్టాల్స్ వద్ద అగ్నిమాపక సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాయదుర్గం ఫైర్ ఆఫీసర్ నాగభూషణ ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం ఉదయం నుంచి అక్కడే ఉంటూ లైసన్సు విక్రయదారులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రతీ స్టాల్ వద్ద నీరు, ఇసుక, అగ్నిమాపక నిరోధక పరికరాలు ఏర్పాటు చేయించామని ఫైర్ ఆఫీసర్ వివరించారు. ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా లైసన్సు హోల్డర్ తో మాట్లాడి ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు.