నిర్మల్: దిలావర్పూర్ మండలం సాంగ్వి గ్రామ గోదావరి నదిలో మహారాష్ట్రకు చెందిన భగవాన్ లాల్ అనే వ్యక్తి మృతదేహం లభ్యం
Nirmal, Nirmal | Sep 15, 2025 దిలావర్పూర్ మండలం సాంగ్వి గ్రామ గోదావరి నదిలో వ్యక్తి మృతదేహం లభ్యమైనట్టు ఎస్సై రవీందర్ సోమవారం తెలిపారు. మహారాష్ట్రలోని పిప్పల్ గావ్ కు చెందిన భగవాన్ లాల్ అనే వ్యక్తి గోదావరి నదిలో పడి మృతి చెంది ఉంటాడని పేర్కొన్నారు. మృతదేహం వరద ప్రవాహానికి కొట్టుకు వచ్చినట్లు తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వివరించారు.