కళ్యాణదుర్గం: మహంతపురం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం, బైక్-ఆటో ఢీ, ఒకరికి తీవ్ర గాయాలు
కుందుర్పి మండలం మహంతపురం గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో-బైక్ ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్ ను డ్రైవ్ చేస్తున్న బోయ జగదీష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బైక్, ఆటో కూడా దెబ్బతిన్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బోయ జగదీష్ ను స్థానికులు గమనించి కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కొరకు అనంతపురం రెఫర్ చేశారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.