వనపర్తి: ఖిల్లా ఘనపూర్:ఉపాధి పనులు కొలతల ప్రకారం చేయాలి....
ఉపాధి పనులు కొలతల ప్రకారం చేయాలని తద్వారా ఉపాధి ఒక్కరోజు వేతనం 272 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమవుతాయని ఎంపీడీవో వెంకటాచారి ఉపాధి కూలీలకు సూచించారు.సోమవారం ఖిల్లా ఘనపూర్ మండలంలోని తిరుమలాయపల్లి, రోడ్డు మీది తండా లో జరుగుతున్న ఉపాధి పనులను అయన మధ్యాహ్నం ఒంటి గంటకు తనిఖీ చేశారు. ఉపాధి కూలీల హాజరు రిజిస్టర్, మాస్టర్ కాపీలను పరిశీలించారు. ఉపాధి పనులకు జాబ్ కార్డు కలిగిన కూలీలు ఖచ్చితంగా హాజరుకావాలని అన్నారు . ఉపాధి పనుల్లో అలసత్వం ప్రదర్శించరాదని అన్నారు. ఉపాధి కూలీలకు కావాల్సిన కనీస సదుపాయాలు నీడ సౌకర్యం తాగునీటి వసతి అందుబాటులో ఉంచాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.