రాచపల్లిలో అరుణాచలం మాదిరిగా శివాలయం దర్శనం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది మాజీ మంత్రి ముద్రగడ తనయుడు గిరి
కాకినాడజిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలో గల ఆంధ్ర అరుణాచల దివ్య క్షేత్రాన్ని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనయుడు వైసిపి ప్రతిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ అయిన ముద్రగడగిరి సందర్శించారు. తమిళనాడు మాదిరిగా మన ప్రాంతంలో ఈ శివాలయం దర్శనం ఇవ్వడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. అనంతరం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ముద్రగడగిరి నిర్వహించారు