తాడిపత్రి: ఉమ్మడి అనంతపురం జిల్లాను ధనధాన్య కృషి యోజన పథకం కింద చేర్చడం ఆనందంగా ఉందని తెలిపిన తాడిపత్రి బిజెపి నేతలు
కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాను ధన ధాన్య కృషి యోజన పథకం కింద చేర్చడం ఆనందంగా ఉందని తాడిపత్రి నియోజకవర్గ బిజెపి నేతలు కొనియాడారు. శనివారం సాయంత్రం 5:30 సమయంలో మీడియాతో బిజెపి జాతీయ కౌన్సిల్ మెంబర్ అంకల్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు మేలు జరిగేలా ఈ పథకం ప్రారంభమైందని చెప్పారు. పశు, మత్స్య, పాడి పరిశ్రమలు ఈ పథకం కింద సాయం చేసి వ్యవసాయ ఆధారిత రైతులకు వ్యవసాయ ఉత్పత్తులను మద్దతు ధర కల్పించాలని ఉద్దేశం తోనే ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో నాలుగు జిల్లాలలో ఉమ్మడి అనంతపురం జిల్లాను ఎంపిక చేసిన రాష్ట్ర సీఎం చంద్రబాబుకు ఆర్థిక శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.