అసిఫాబాద్: గంజాయి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం: ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్
గంజాయి నిర్మూలనకు జిల్లా ప్రజల సహకారం ఎంతో అవసరం ఉంటుందని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..గంజాయి నిర్మూలనకు పోలీస్ తరఫున ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 57 గంజాయి కేసులను నమోదు చేసి నిందితులను జైలుకు పంపించినట్లు తెలిపారు. గతంలో కూడా గంజాయి కేసులు ఎక్కువగా కాగా.. ఈ సంవత్సరం నేటి వరకు ఒక కోటి రూపాయలపై చిలుకు డ్రై గంజాయి మొక్కలను పట్టుకున్నట్లు తెలిపారు. గంజాయికి అలవాటైన యువత ఊహల్లో తేలి ఆడుతున్నారని దీనివల్ల నేరాలకు సైతం పాల్పడుతున్నారని అన్నారు.