సోమందేపల్లిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం
శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని పత్తికుంట పల్లి గ్రామంలో ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని గ్రామస్థులు కనుగొన్నారు. స్థానికులు మంగళవారం ఉదయం వాకింగ్ వెళ్తుండగా బస్టాండ్ సమీపంలోని ఓ మోరీ వద్ద మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని హత్య చేసి పడేసి వెళ్లారా? లేక ఇతర ఏదైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసులు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.