గొల్లపూడి తెదేపా కార్యాలయంలో ఘనంగా మాజీ మంత్రి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వర్ధంతి కార్యక్రమాలు
Mylavaram, NTR | Sep 16, 2025 మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి తెదేపా కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో మాజీ మంత్రి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వర్ధంతి కార్యక్రమాలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కోడెల శివప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు.