రాయదుర్గం: పులకుర్తి సమీపంలో బళ్ళారి రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులు
డి.హిరేహాల్ మండలంలోని పులకుర్తి సమీపంలో బళ్ళారి రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలతో రోడ్డుపై పడిపోయి ఉండగా అటుగా వెళుతున్న కొందరు 108 కు పోన్ చేసి సమాచారం అందించారు. అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో ప్రైవేట్ వాహనంలో బళ్లారి విమ్స్ ఆస్పత్రికి వారినీ తరలించినట్లు స్థానికులు తెలిపారు. అయితే గాయపడిన వారు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నందున వారి వివరాలు తెలియరాలేదు. ప్రమాదం ఎలా జరిగిందో కూడా తెలియలేదు. ఘటనపై డి.హిరేహాల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు