ఒంగోలులో భారీ వర్షం. రోడ్లపై నిలిచిన నీరు. ఇబ్బంది పడ్డ వాహనదారులు
Ongole Urban, Prakasam | Sep 17, 2025
అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరాన్ని తడిసి ముద్దచేసింది. ఉదయం రెండు గంటల పాటు కురిసిన కుండపోత వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. సుమారు రెండు నుంచి మూడు గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన ఈ వానతో పలు లోతట్టు కాలనీలు నీటమునిగిపోయాయి. బలరాం కాలనీ, కేశరాజుకుంట వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రధాన రహదారులు చెరువుల్లా మారిపోయాయి. వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. నగరంలోని మార్కెట్ సెంటర్, బస్టాండ్ పరిసరాల్లో రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో జనం తీవ్రంగా