తాడిపత్రి: రోడ్ల మరమ్మతులకు కొత్త రోడ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం కోరిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి
తాడిపత్రి నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు, కొత్త రోడ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కోరారు. సోమవారం సాయంత్రం అసెంబ్లీ లోని డిప్యూటీ సీఎం ఛాంబర్ లో పవన్ కళ్యాణ్ ను కలిశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని జెసి అస్మిత్ రెడ్డి పవన్ కళ్యాణ్ కు అందజేశారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి తొందర్లో నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటానని తెలిపినట్లు జేసీ అస్మిత్ రెడ్డి చెప్పారు.