జమ్మలమడుగు: మైలవరం : చేనేత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి - జిల్లా అధ్యక్షులు శివ నారాయణ
ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం 11వ రాష్ట్ర మహాసభలు అక్టోబర్ 6 7 తేదీలలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించడం జరుగుతుందని మహాసభకు చేనేత కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరనాల శివ నారాయణ తెలిపారు. రాష్ట్ర మహాసభల కరపత్రాలను సోమవారం కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని మైలవరం మండలం మైలవరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత రెండవ ప్రాధాన్యత కలిగిన రంగం చేనేత రంగమన్నారు.మానవ సమాజానికి నాగరికత నేర్పిన చేనేత కార్మికులు నేడు పాలకుల అవలంబిస్తున్న కార్పొరేట్ విధానాల వలన సంక్షేమంలో పడిందన్నారు.