భూపాలపల్లి: కేటీకే–6 ఇంక్లైన్ లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మొండయ్యకు మెరుగైన వైద్యం అందించాలి:మాజీ ఎమ్మెల్యే
భూపాలపల్లి కేటీకే–6 ఇంక్లైన్ లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మొండయ్య ను హైదరాబాదులోని ఒమేగా హాస్పిటల్లో పరామర్శించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి గారు కార్మికుని పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గురైన కార్మికునికి మెరుగైన వైద్యం అందించాలని సింగరేణి జీఎం కోఆర్డినేటర్ టి. శ్రీనివాస్ మరియు డాక్టర్ బాలకోటయ్య గారిని కోరడం జరిగింది. ఈ సందర్భంగా మొండయ్య గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది.