మంత్రాలయం: వాహన మిత్రకు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది:టిడిపి నియోజకవర్గం ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం:వాహన మిత్ర కు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని టీడీపీ మంత్రాలయం నియోజవర్గం ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. బుధవారం మాధవరం లో ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద ఒక్కొక్కరికి రూ.15 వేలు ఆర్థిక సహాయం అందించనుందన్నారు. వచ్చే నెల 1న నేరుగా వారి ఖాతాలలో జమ అవుతాయన్నారు. అర్హులైన ఆటో డ్రైవర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.