పులివెందుల: నియోజకవర్గంలో ద్రోణి ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న పంటలు
Pulivendla, YSR | Sep 20, 2025 కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లోని వేంపల్లి, చక్రాయపేట వేముల మండలాల్లో రాత్రి ద్రోని ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల వందల ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వేంపల్లి మండలంలో వరి పంట, టమోటా, ఉల్లి దెబ్బతిన్నాయి. వేముల మండలంలో ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులు బాగా నష్టపోయారు. ఇప్పుడు రైతులు ఎక్కువగా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. సంబంధిత ప్రభుత్వాధికారులు పంట నష్టం జరిగిన ప్రాంతాలలో పర్యటించి నష్టపోయిన పంటలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు సిద్ధమయ్యారు.