ఉదయగిరి: పెరమన వద్ద కారును ఢీకొన్న టిప్పర్ ఏడుగురు మృతి మృతులు వరికుంటపాడు మండల వాసులుగా గుర్తింపు
సంగం మండలం పెరమణ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి స్వగ్రామం వరికుంటపాడు మండలం జంగం రెడ్డిపల్లిగా గుర్తించారు. వీరు పనుల నిమిత్తం కొన్నేళ్లుగా నెల్లూరులో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనలో జంగంరెడ్డిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు చనిపోయారు.