గుంతకల్లు: గుత్తిలోని చెంబుల బావి వీధిలో వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తిపై దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు
గుత్తిలోని చెంబుల బావి వీధిలో మంగళవారం రాత్రి డబ్బు విషయంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆఫ్జల్ అనే వ్యక్తితో పాటు కొంతమంది కట్టెలు, రాడ్లు తీసుకుని వెంకటరామిరెడ్డి పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బుధవారం సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దాడి దృశ్యాలను పోలీసులు బహిర్గతం చేశారు. ఈ ఘటన పై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.