ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారం చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కడప డాక్టర్ యామిని సూచనల మేరకు గౌరవ సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎస్.బాబా ఫక్రుద్దీన్ సోమవారం కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు సబ్ జైలు లీగల్ ఎయిడ్ క్లినిక్ లను సందర్శించారు.ఈ సందర్బంగా ఆయన రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సబ్ జైల్ లీగల్ ఎయిడ్ క్లినిక్ ల ప్రాధాన్యతను తెలిపారు.