చల్లగుండ్ల గ్రామంలో 10 కేజీల గంజాయి పట్టివేత 9 మంది అరెస్ట్
నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామంలో 10 కేజీల గంజాయి పట్టుకున్నట్లు సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు కు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చిన సమాచారం మేరకు 9 మంది సభ్యులు అరెస్టు చేసి వారి దగ్గర నుండి సెల్ ఫోన్లు 5000 రూపాయల నగదు ఒక స్కూటీని సీజ్ చేసినట్లుగా పేర్కొన్నారు. మరో 8 మంది సభ్యులు పరారీలో ఉన్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నకరికల్లు ఎస్సై సతీష్ పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.