వర్ని: అక్బర్ నగర్ తాజా మాజీ సర్పంచ్ బిజెపిలో చేరిక
రుద్రూరు మండలం అక్బర్ నగర్ తాజా మాజీ సర్పంచ్ గంగమని వరప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలో చేరారు. బుధవారం ఉదయం 10 గంటలకు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు .ఆయనకు లక్ష్మీనారాయణ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బాన్సువాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఎక్కువై ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదని అందుకే విసుకు చెంది బిజెపిలో చేరినట్లు గంగామణి వరప్రసాద్ వెల్లడించారు.