అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా కలికిరి హౌసింగ్ కార్యాలయ ఆవరణం
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా కలికిరి హౌసింగ్ కార్యాలయం ఆవరణం మారింది. కలికిరి మండలం కలికిరి పట్టణంలోని మండల విద్యాశాఖ కార్యాలయ సముదాయంలో హౌసింగ్ కార్యాలయం తో పాటు ఉర్దూ పాఠశాలతో తెలుగు మెయిన్ పాఠశాల తదితర సముదాయాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండడంతో ఆఫీసు వేళల అనంతరం అధికారులు లేని సమయంలో ఆకతాయిలు,మందు బాబులు అక్కడికి చేరి హాన్స్, గుట్కా, ధూమపానం, మద్యం సేవించి అక్కడే బీరు బాటిళ్లు పగలగొడుతూ,సిగెరెట్ పీకలు వేస్తూ,హాన్స్,గుట్కా నమిలి అక్కడే ఉమ్మి వేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పని వేళలో అధికారులు వచ్చి చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు