పామర్రులో టీడీపీ కూటమి నాయకులపై వైసీపీ నేతల ఆగ్రహం
Machilipatnam South, Krishna | Sep 17, 2025
పామర్రు లో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పై అవాకులు, చవాకులు పేలిస్తే చూస్తూ ఊరుకోమని వైసీపీ నాయకులు హెచ్చరించారు. పామర్రు వైసీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఎంపీపీ దాసరి అశోక్ మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నప్పుడు లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కాకర్ల వెంకటేశ్వరావు, రాజేంద్ర, రమేశ్ యాదవ్, గవాస్కర్ రాజు, ఆరేపల్లి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.