పత్తికొండ: పత్తికొండ పట్టణంలో మలేరియా డెంగ్యూ వ్యాధి పై విద్యార్థులకు అవగాహన
పత్తికొండ పట్టణం రాజీవ్ నగర్లో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మలేరియా, డెంగ్యూ విష జ్వరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. విషజ్వరాలు ఏ విధంగా వ్యాపిస్తాయో మలేరియా సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వర్లు వివరించారు. మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. దోమతెరలు వాడాలని, వేప పొగ వేసుకోవాలని, హ్యాండ్ వాష్ తరచుగా చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.