జమ్మలమడుగు: బద్వేల్ : పట్టణంలోని కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా నిర్వహించారు.ఈరోజు తెల్లవారుజాము నుంచి అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించిన అనంతరం చెరకు గడలతో అలంకారం నిర్వహించారు. ప్రత్యేక అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం ప్రత్యేక పల్లకిలో అమ్మవారి విగ్రహాన్ని గుడి ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.