నవాబ్‌పేట: దారూర్ గట్టేపల్లి గేటు వద్ద సిమెంట్ ట్యాంకర్ ఢీకొని ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలు
వికారాబాద్ జిల్లా దారులు మండల పరిధిలోని గట్టేపల్లి గేటు వద్ద తాండూర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై సిమెంట్ ట్యాంకర్ ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. దారులు ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం పెద్దెముల మండలం రుక్నా రుక్మాపూర్ గ్రామం చెందిన భాను ప్రసాద్ పని నిమిత్తం వికారాబాద్ నుంచి తాండూర్ వెళ్తుండగా సిమెంట్ యాంకర్ ఢీకొనగా అతనికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూనట్లు తెలిపారు.