ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ బుధవారం నిర్వహించారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాలను జిల్లా కార్యాలయానికి పంపుతున్నట్లు కుందూరు నాగార్జున రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో 60 వేల కుటుంబాలకు పైగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి ఒప్పుకోవడం లేదని నాగార్జున రెడ్డి అన్నారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కి పూలమాలవేసి నాయకులు నివాళులు అర్పించారు.