శ్రీకాకుళం: వాతావరణ మార్పులు కారణంగా పశువుల్లో గాలికుంటు వ్యాధి వ్యాపించే అవకాశం ఉందన్న నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి
వాతావరణ మార్పులు కారణంగా పశువుల్లో గాలికుంటు వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని, ఈ వ్యాధి సోకితే దాని నివారించేందుకు ఎన్నో ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. సోమవారం పోలాకి మండలం కత్తిరవాని పేటలో పశువ్యాధి నియంత్రణలో భాగంగా గాలికుంటు టీకాల కార్యక్రమాని ప్రారంభించారు. ప్రభుత్వం వీటిని ఉచితంగానే అందజేస్తుందని ఆయా రైతులు పాడిపశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలన్నారు.