మార్కాపురం జిల్లా కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ మహర్షి పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక డిఎస్పీ కార్యాలయం వరకు చేరుకొని డీఎస్పీ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ పామూరు మండలం బోట్ల గుండూరు గ్రామంలో జనవరి 18వ తేదీ సాయంత్రం రజక కులానికి చెందిన ఆటో డ్రైవర్ మహర్షి నిమ్మకాయలోడుతో పోతుండగా అదే రోడ్డున వెళ్తున్న ఒక వ్యక్తికి నిమ్మకాయల బస్తా తగిలి కింద పడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన అ వ్యక్తి గ్రామంలోని అగ్రవర్ణాల చెందిన వారితో మహర్షిని కట్టివేసి తీవ్రంగా గాయపరిచారు అన్నారు. సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.