గుడివాడ బైపాస్ రోడ్డులో కళాశాల, పాఠశాల విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిలపై ఉక్కుపాదం మోపుతున్న DSP ధీరజ్ వినీల్
Machilipatnam South, Krishna | Sep 15, 2025
మఫ్టీలో గుడివాడ డీఎస్పీ స్తానిక గుడివాడ బైపాస్ రోడ్డులో కళాశాల, పాఠశాల విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిలపై సోమవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల సమయంలో పోలీసులు ఉక్కుపాదం మోపారు. గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్, సిబ్బంది మఫ్టీలో టీమ్స్ ఏర్పడి ఈటీజర్లను గుర్తించారు. మహిళా విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉన్నామని, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.