పత్తికొండ: పత్తికొండలో గర్భిణీ స్త్రీలకు ఎమ్మెల్యే శ్యాంబాబు భోజన సౌకర్యం
పత్తికొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గర్భిణులకు స్కానింగ్, ఆరోగ్య పరీక్షలు వైద్యాధికారి కల్పన సోమవారం చేశారు. గర్భిణిలకు, వారి సహాయకులకు భోజన వసతి సౌకర్యాలను ఎమ్మెల్యే శ్యాంబాబు ఏర్పాటు చేయించారు. ఆరోగ్య పరీక్షలకు గర్భిణులు భారీ ఎత్తున తరలివచ్చారు. టీడీపీ నాయకులు సురేంద్ర, రమేశ్, వినయ్ గౌడ్ భోజన వసతి సౌకర్యాలను పర్య వేక్షించారు.