ఇబ్రహీంపట్నం: పారిశుద్ధ కార్మికుల విధి నిర్వహణను పరిశీలించిన హయత్ నగర్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి
హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి గారు నేడు కాలనీ వాసులకు ఫిర్యాదు మేరకు డివిజన్లోని కామల నగర్ లో పారిశుద్ధ కార్మికుల విధి నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పారిశుద్ధ కార్మికులు విధులు నిర్వహించడం లేదని కాలనీ లో చెత్తను ఊడ్చి తీయకుండా అలాగే వదిలేయడంతో మరలా అది గాలికి ఊడ్చిన ఉడనట్టే అవుతుందని కాలనీ వాసులు వివరించడంతో. స్పందించిన కార్పోరేటర్ గారు సంబంధిత శానిటేషన్ సూపర్వైజర్ రాజ్ కుమార్ గారి పిలిపించి పారిశుద్ధ కార్మికులు విధులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.