ఫరూక్ నగర్: నియోజకవర్గంలోని పలు మండలాలలో కురుస్తున్న భారీ వర్షం.. వాహనాదారుల రాకపోకలకు అంతరాయం
షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఫరూఖ్ నగర్, కొత్తూరు, కొందుర్గు, కేశంపెట్, నందిగామ మండలాల్లో శనివారం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ప్రజలు ఎండ వేడిమి నుంచి కొంత ఊరట చెందారు. ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తుంది. దీంతో పలుచోట్ల విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడింది. అకాల వర్షం పడుతున్న తరుణంలో వాహనాదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు వాహనదారులు తెలిపారు.