అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని లచ్చానుపల్లి గ్రామ శివారులో ఇసుక కోసం తవ్విన గుంతలో రక్త పింజరి పాము పడి పోయింది. గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు సోమవారం అటుగా వెళ్లగా వాటిని గమనించారు. ప్రస్తుతం అది కదలలేని స్థితిలో జీవచ్ఛవంలా పడి ఉంది. లచ్చానుపల్లి నుంచి గుత్తి అర్ఎస్ కు వచ్చే మార్గంలో గతంలో కొందరు ఇసుక కోసం గుంతలు తవ్వారు. అది ఆహారం కోసం వెళ్ళి గుంతలో నుంచి బయటకు రాలేక లోపలే ఉండిపోయింది. అటవీ శాఖ అధికారులు స్పందించి పామును బయటకు తీసి సురక్షిత ప్రాంతంలో వదలాలని కాపరులు కోరుతున్నారు.