మంత్రాలయం: కౌతాళం కేజీబీవీ హాస్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి : ఏఐఎస్ఎఫ్ మహిళా మండల కన్వీనర్
కౌతాళం : మండల కేంద్రంలోని కేజీబీవీ హాస్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ మహిళా మండల కన్వీనర్ లత మానస ప్రిన్సిపల్‌ను కోరారు. వార్‌ను శుక్రవారం కేజీబీవీ హాస్టల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా వాష్ రూములలో సరైన నీటి సరఫరా లేకపోవడంతో విద్యార్థులు మూత్ర విసర్జనకు వెళ్లినప్పుడు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.