కళ్యాణదుర్గం: మహంతపురంలో ఈ టీచర్ మా వద్దని ఆందోళన చేపట్టిన గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు
ఈ టీచర్ మాకొద్దని విద్యార్థులు తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టిన ఘటన కుందుర్పి మండలం మహంతపురం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. శివ శంకర్ అనే టీచర్ 2021 నుంచి మహాంతపురం పాఠశాలలో పనిచేస్తున్నారు. అయితే పాఠశాలకు సక్రమంగా హాజరు కాలేదు. ఇటీవల అతన్ని బదిలీ చేశారు. అయితే రికమండేషన్‌తో తిరిగి అదే పాఠశాలకు వచ్చాడు. దీంతో గ్రామస్తులు ఈ టీచర్ మాకు వద్దు అంటూ ఆందోళన చేసి ఎంఈఓ తిప్పే స్వామికి వినతిపత్రం అందజేశారు.