గిద్దలూరు: కంభం పట్టణంలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ ర్యాలీ
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఐ మల్లికార్జున, తహసిల్దార్, ఎంపీడీవో ఎస్సైలు నరసింహారావు, రవీంద్రారెడ్డి, నాంచారయ్య ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కందులాపురం సెంటర్లో మానవహారం నిర్వహించి విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల అమరవీరులను స్మరిస్తూ వారికి నివాళులు అర్పించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలని సిఐ మల్లికార్జున విద్యార్థులకు సూచించారు.