రాయదుర్గం పట్టణ సమీపంలోని పైతోట వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘనంగా కౌన్సిలర్ ఐనాపురం మంజునాథ తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం సాయంత్రం 4.30 సమయంలో రాయదుర్గం వైపు నుంచి మొలకల్మూరు వైపు బైక్ పై వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మంజునాథ ను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బళ్లారి విమ్స్ కు తరలించారు. విషయం తెలుసుకున్న పలువురు వైఎస్సార్సీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.