అసిఫాబాద్: భీంపూర్ పెద్దవాగు నుంచి అక్రమ ఇసుక రవాణా:DYFI జిల్లా కార్యదర్శి కార్తీక్
ఆసిఫాబాద్ మండలం భీంపూర్ నుంచి రోజుకు 100 ఇసుక ట్రాక్టర్ల తరలిస్తున్నారని DYFI జిల్లా కార్యదర్శి కార్తీక్ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ మండలంలోని భీంపూర్ వాగు నుంచి వాంకిడి మీదుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ఆరోపించారు. స్థానికంగా ఉన్న వ్యక్తులే అక్రమ ఇసుక దందా చేస్తున్నారని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.