కనిగిరి పట్టణంలోని 5 మరియు 15వ వార్డులలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఈ వార్డుల్లో నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీ కాలువల నిర్మాణానికి చేపట్టవలసిన పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో డ్రైనేజీ కాలువలు లేనిచోట్ల వాటిని గుర్తించి, డ్రైనేజీ కాలువలను నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.