కుప్పం: ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ద్రవిడ వర్సిటీ వీసి ఆచార్య దొరస్వామి
సీఎం చంద్రబాబును ద్రవిడ వర్సిటీ వీసీ ఆచార్య దొరస్వామి బుధవారం నాడు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కలిశారు. కుప్పం పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్ సీఎంకు స్వాగతం పలికారు. వర్సిటీలో నెలకొన్న సమస్యలను ఆయనకు వివరించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ద్రవిడ వర్సిటీ అభివృద్ధి కుంటుపడుతోందని చెప్పారు.