రావిలంక గోదావరిలో మునిగి ఇద్దరు బాలురు మృతి చెందిన ఘటనలో బాధితులకు పరిహారం అందించిన ఎమ్మెల్యే సత్యనారాయణ
పి.గన్నవరం మండలం, నాగుల్లంక పరిధిలోని రావిలంకలో స్నానానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు సానబోయిన సూర్యతేజ మరియు కేతా ప్రవీణ్ గోదావరిలో మునిగి మృతిచెందారు. ఈ విషాదకర ఘటనపై వెంటనే స్పందించిన పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను వారి కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు.