జమ్మికుంట: AMC చైర్ పర్సన్ స్వప్న ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని మార్కెట్ యార్డును సందర్శించిన పాలకవర్గం
జమ్మికుంట: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా లోని మార్కెట్ మిర్చి యార్డును శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ లో జరిగే క్రయవిక్రయాల తో పాటు మార్కెట్ లో పాలకవర్గం ఏటువంటి కార్యకలాపాలు చేపడుతుందో పరిశీలించారు. అదేవిధంగా మార్కెట్లో వ్యాపారులు ఎలాంటి సిస్టం ను అవలంబిస్తున్నారు అనే విషయాలను తెలుసుకున్నామని చైర్ పర్సన్ పుల్లూరు స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి పాలకవర్గ సభ్యులు దీక్షిత్ సూర్య శ్రీపతి రెడ్డి సదానందం శ్రీనివాస్ సునీల్ రాజేశ్వరరావు పాల్గొన్నారు.